ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో ముందుంటా

by Ratna Kumari |

రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎండి సుల్తాన్ అలీ ని ఎట్టకేలకు నియమితుల‌య్యాడు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో ముందుంటా
X

దిశ‌, రేవ‌ల్లి : రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎండి సుల్తాన్ అలీ ని ఎట్టకేలకు నియమితుల‌య్యాడు. ఏదుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పండుగ సుఖేందర్ రెడ్డి పార్టీ అధిష్టానం నియమించింది. జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ నాయ‌క‌త్వానికి వారు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ, కాంగ్రెస్ పార్టీ జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తూ అంకితభావంతో పని చేస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం, పార్టీ అభివృద్ధి, కార్యకర్తల గౌరవం మా ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేలా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తామని వారు అన్నారు. పార్టీ ఇచ్చిన గౌర‌వాన్ని బాధ్య‌త‌గా భావిస్తూ.. నాయ‌క‌త్వం ఆశ‌యాల‌కు అనుగుణంగా నిరంత‌రం ప్ర‌జా సేవలో ఉంటామ‌ని తెలిపారు.

Next Story