విద్యార్థులు ఉన్న‌త స్థాయి ల‌క్ష్యాల‌ను ఎంచుకోవాలి : ఎస్పీ రావుల గిరిధ‌ర్

by Ratna Kumari |

దిశ‌, గోపాల్ పేట : విద్యార్థులు ఉన్న‌త స్థాయి ల‌క్ష్యాల‌ను ఎంచుకొని వాటి సాధ‌న కోసం కృషి చేయాల‌ని ఎస్పీ రావుల గిరిధ‌ర్ సూచించారు. వ‌న‌ప‌ర్తి జిల్లా గోపాల్ పేట మండ‌లం బుద్దారం

విద్యార్థులు ఉన్న‌త స్థాయి ల‌క్ష్యాల‌ను ఎంచుకోవాలి : ఎస్పీ రావుల గిరిధ‌ర్
X

దిశ‌, గోపాల్ పేట : విద్యార్థులు ఉన్న‌త స్థాయి ల‌క్ష్యాల‌ను ఎంచుకొని వాటి సాధ‌న కోసం కృషి చేయాల‌ని ఎస్పీ రావుల గిరిధ‌ర్ సూచించారు. వ‌న‌ప‌ర్తి జిల్లా గోపాల్ పేట మండ‌లం బుద్దారం గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. చిన్న‌ప్ప‌టి నుంచే విద్యార్థులు క‌ఠోర‌మైన దీక్ష‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ముందు సాగాల‌ని తెలిపారు. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు బానిస కావ‌ద్ద‌ని సూచించారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని.. విద్యార్థి దశలో క్రమశిక్షణ, నైతిక విలువలు చదువుపై దృష్టి పెట్టడం వలన మాత్రమే ఉన్నత భవిష్యత్తు సాధ్యమని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించడంలో పడుతున్న కష్టాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, సమాజంలో ఉన్న రుగ్మతల నుంచి దూరంగా ఉండి తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత హెచ్. రమేష్ బాబు, బుద్ధారం మాజీ సర్పంచులు, అచ్యుత రామారావు, జాంప్లా నాయక్,విశ్వవాణి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, పూలియా నాయక్, విష్ణు, సలహాదారు డాక్టర్ శేఖర్ పాల్గొన్నారు.

Next Story