బ‌స్సు సౌక‌ర్యం కోసం విద్యార్థులు క‌లెక్ట‌ర్ కి విన‌తి

by Nallavelli.Anjaneyulu |

దిశ, శ్రీరంగాపూర్ : మండ‌ల ప‌రిధిలోని కంబాలపూర్ గ్రామం నుంచి దాదాపు 40 మంది బాలికలు ప్రతినిత్యం మండల కేంద్రానికి పై చదువుల కోసం వెళ్తుంటారు. కానీ చదువు ముగించుకొని

బ‌స్సు సౌక‌ర్యం కోసం విద్యార్థులు క‌లెక్ట‌ర్ కి విన‌తి
X

దిశ, శ్రీరంగాపూర్ : మండ‌ల ప‌రిధిలోని కంబాలపూర్ గ్రామం నుంచి దాదాపు 40 మంది బాలికలు ప్రతినిత్యం మండల కేంద్రానికి పై చదువుల కోసం వెళ్తుంటారు. కానీ చదువు ముగించుకొని సాయంత్రం సొంత గ్రామం చేరడానికి ఐదు గంటలకు పాఠశాల వదలగా.. వారి గ్రామానికి రావడానికి బస్సు సౌకర్యం లేక‌పోవ‌డంతో ప్రతిరోజు నడుచుకుంటూ కంబాలపురం గ్రామం చేరుకుంటున్నారు. దీంతో బ‌స్సు సౌక‌ర్యం లేక విద్యార్థులు స్కూల్ వ‌ద్ద నుంచి ఇంటికి రావాలంటే రోజు రాత్రి 7 గంటల స‌మ‌యం అవుతుంద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్త చేస్తున్నారు. విద్యార్థులు స్వ‌యంగా క‌లెక్ట‌ర్ కి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అలాగే బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని డిపో మేనేజ‌ర్ కి కూడా విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

Next Story