సైబ‌ర్ నేరాలపై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి : ఎస్సై రాణి

by Ratna Kumari |

దిశ‌, వీస‌న‌గండ్ల : సైబ‌ర్ నేరాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి అని ఎస్సై రాణి సూచించారు. వీస‌న‌గండ్ల పోలీస్ స్టేష‌న్ లో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల

సైబ‌ర్ నేరాలపై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి : ఎస్సై రాణి
X

దిశ‌, వీస‌న‌గండ్ల : సైబ‌ర్ నేరాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి అని ఎస్సై రాణి సూచించారు. వీస‌న‌గండ్ల పోలీస్ స్టేష‌న్ లో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థుల‌కు పోలీస్ వ్య‌వ‌స్థ‌, చ‌ట్టం, ప్ర‌జ‌ల హ‌క్కులు అంశాల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సై రాణి మాట్లాడారు. ప్ర‌తీ పౌరుడికి చ‌ట్టం ముందు స‌మాన హ‌క్కులు ఉన్నాయ‌ని.. ఎవ‌రైనా నేరానికి గురైతే లేదా సాక్ష్యం ఉంటే వెంట‌నే పోలీసుల‌ను సంప్ర‌దించ‌డం ప్ర‌తీ పౌరుడి బాధ్య‌త అన్నారు. ఎఫ్ఐఆర్ దాఖ‌లు విధానం, భార‌త రాజ్యాంగంలోని మౌలిక హ‌క్కులు, సైబ‌ర్ నేరాలు, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ చ‌ట్టాలు, యువ‌త‌కు సంబంధించిన చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల‌ను విద్యార్థుల‌కు వివ‌రించారు. ఎఫ్ఐఆర్ న‌మోదు కేంద్రం, సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రం, మ‌హిళా స‌హాయక కేంద్రం, పౌర సేవా విభాగాల‌ను చూపించారు. పోలీసులు ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై విద్యార్థుల‌కు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న క‌లిగింద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో హెడ్ కానిస్టేబుల్ వెంక‌టేష్, కళాశాల ప్రిన్సిపాల్ శివ గౌడ్ అధ్యాపకులు లక్ష్మి నారాయణ, కానిస్టేబుల్ నరసన్న గౌడ్, జగదీష్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story