పరిశ్రమల విజిట్ ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందుతారు : జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్

by Ratna Kumari |   (  Updated:2026-03-06 15:07:56  IST  )

పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్ లను విద్యార్థులు సందర్శించడం ద్వారా ప్రత్యక్ష అనుభవం పొందుతారని, తద్వారా యంత్రాల పని తీరు పట్ల అవగాహన పెరుగుతుందని మహబూబ్ నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ అన్నారు.

పరిశ్రమల విజిట్ ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందుతారు :  జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్ లను విద్యార్థులు సందర్శించడం ద్వారా ప్రత్యక్ష అనుభవం పొందుతారని, తద్వారా యంత్రాల పని తీరు పట్ల అవగాహన పెరుగుతుందని మహబూబ్ నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక జెపిఎన్సీఈ కళాశాలలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ఇం జనీరింగ్ (ఈఈఈ) మూడవ, నాలుగో సంవత్సరం విద్యార్థులు శ్రీశైలం ప్రాజెక్టు రైట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ ను ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించిన సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

ఈ ఇండస్ట్రియల్ విజిట్ ద్వారా విద్యార్థులు విద్యుత్ ఉత్పత్తి ప్రత్యక్ష ప్రక్రియపై విలువైన అవగాహన పొందుతారని, హైడ్రో టర్బైన్ రూపకల్పన, పని విధానం, జనరేటర్ కంట్రోల్ సిస్టమ్,లోడ్ మెనేజ్మెంట్, గ్రీడ్ సింక్రనైజేషన్ వంటి అంశాలను తీసుకుని, అత్యంత ప్రయోజనకరంగా వారి సాంకేతిక జ్ఞానం, వృత్తి పరమైన అవగాహన పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈఈ హెచ్ఓడి వెంకటేష్, సీనియర్ ఇంజినీర్లు రాజశేఖర్,బాల సుభలక్ష్మీ, రవీందర్,శ్రీకాంత్,ఫిరోజ్, అధ్యాపకులు సంపత్ పటేల్, ప్రశాంత్,నరేష్,మవునిక,తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story