సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

by Naveena |

: పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలు ఆదేశించారు.

సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలు ఆదేశించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్,రాష్ట్ర సచివాలయం నుండి వ్యవసాయం,సాగునీరు సరఫరా అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు,వ్యవసాయ శాఖ,ఇరిగేషన్ సంబంధిత అధికారులతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,తుమ్మల నాగేశ్వర రావులు మాట్లాడుతూ.. పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

రైతులకు సకాలంలో సాగు నీరు అందించాలని,సరఫరాలో రైతులకు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ..జిల్లాలో యాసంగి లో సాగు నీరు సమస్యతో పంటలు ఎండి పోకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రెవెన్యూ,వ్యవసాయ శాఖ,ఇరిగేషన్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్,మోహన్ రావు వ్యవసాయ,ఇరిగేషన్ అధికారుసాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలిలతో పాల్గొన్నారు.

Next Story