మ‌హిళ‌లు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కృతజ్ఞతన అభివృద్ధి పథంలోకి ముందుకెళ్తుంద‌ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు

మ‌హిళ‌లు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
X

దిశ, అచ్చంపేట : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కృతజ్ఞతన అభివృద్ధి పథంలోకి ముందుకెళ్తుంద‌ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా మాట్లాడుతూ.. మహిళా సాధికారత (Women Empowerment), మహిళలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ పథకం మహిళల ఉన్నతి కోసం ఉద్దేశించబడిందన్నారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం తెలంగాణ సాంప్రదాయంగా భావిస్తూ , దానిని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డనూ తోబుట్టువుగా భావించి చీర అందిస్తోందన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆమె స్ఫూర్తితోనే మహిళలకు రిజర్వేషన్లు, జీరో వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రేషన్ కార్డు ఉన్న పేదరికపు (BPL) కుటుంబాల్లోని మహిళలు, వితంతువులు, వృద్ధాప్య మహిళలు అందరికీ ఈ చీరలు పంపిణీ చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story