- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం గా జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పేరుగాంచింది. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది.

దిశ, జడ్చర్ల : నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం గా జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పేరుగాంచింది. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. నిన్న ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం వచ్చిన శవాన్ని కుక్కలు పీకుతున్నడం నుంచి ఆస్పత్రిలో వసతుల లేమితో ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన మందులు, లేకపోవడంతో పాటు ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. మరోవైపు సిబ్బంది చేతివాటం చూపించడం.. ఆసుపత్రిని ఎల్లవేళలా పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేసే సూపరింటెండెంట్ ఆసుపత్రికి సరిగ్గా రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. మరోవైపు తాను వచ్చిన రోజు మాత్రం ఫుల్ అటెండెన్స్ వేసుకోవడంతో ఆస్పత్రిలోని మిగతా సిబ్బంది కూడా సూపరింటెండెంట్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఆసుపత్రి పర్యవేక్షణ లోపంతో నిర్లక్ష్యానికి నిండు నిదర్శనం గా జడ్చర్ల ఏరియా ఆసుపత్రి నిలిచింది.
జడ్చర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి కాస్త ఏరియా ఆసుపత్రిక మారి 50 పడకల ఆసుపత్రిగా కోసాగుతోంది. గత ప్రభుత్వం జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు 24 గంటల పాటు అత్యవసర సేవలతో పాటు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో 30 పడకల నుండి 100 ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేసింది. కానీ ప్రస్తుతం జడ్చర్ల 50 పడకల ఏరియా ఆసుపత్రి కొనసాగుతుంది. అవసరమైన నిధులు, వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గైనిక్ సేవలకై సిబ్బందికి సరిపడా ఉన్న కానీ ఆసుపత్రిలో ప్రసూతి ల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇదే పట్టణంలోని ప్రవేట్ ఆసుపత్రిలో ప్రసూతిల సంఖ్య అధికంగా ఉండడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సంఖ్య పడిపోవడానికి ఆసుపత్రిలో ని వైద్యులు సమయపాలన పాటించకూడా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. రోగులు ప్రశ్నిస్తే గద్దించడం వంటి ఘటనలతో ఆసుపత్రికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
గతంలో ఇదే ఆసుపత్రిలో డెలివరీ వచ్చిన ఓ మహిళకు డెలివరీ చేయాల్సిన గైనిక్ వైద్యురాలు తన డ్యూటీ టైం అయిపోయిందని వెళ్లిపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఆసుపత్రి అటెండర్ ప్రసూతి చేయడంతో శిశువు మరణించిన ఘటన ఘటనలో కూడా బాధ్యులపై చర్యలు తీసుకుపోవడం తో ప్రజల్లో ఈ ఆసుపత్రి పై విశ్వాసం లేకుండా పోయింది. కేటాయింపు జడ్చర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన ఏరియా ఆసుపత్రిలో నూతనంగా పోస్టుమార్టం గది నిర్మాణం పూర్తై ఆరు నెలల క్రితమే ఆ గదిని స్వాధీనపరచుకోవాల్సిందిగా కాంట్రాక్టర్ లేక రాసి ఇచ్చాడు. పోస్టుమార్టం గదిని స్వాధీన పరుచుకున్న ఆసుపత్రిలో పోస్టుమార్టం సేవలను ప్రారంభించకపోగా ఆ గదిని ఆసుపత్రిలో జరుగుతున్న ఇతర నిర్మాణాలకై తీసుకువచ్చిన సిమెంట్ బస్తాల కొరకు కేటాయించారు.
అందులో సిమెంట్ బస్తాలు ఉంచారు ప్రభుత్వం నుండి మంజూరైన నూతన ఫ్రీజర్లు కూడా అదే గదిలో ఉంచి ఉపయోగం లేకుండా చేశారు. దీంతోనే సోమవారం ఆస్పత్రికి వచ్చిన మృతదేహానికి కుక్కలు పీక్కుతినేకడానికి ప్రధాన కారణం ఆసుపత్రి సూపర్డెంట్ నిర్లక్ష్యానికి రాష్ట్రం మొత్తం తలదించుకునే అవమాన ఘటన జడ్చర్ల ఆసుపత్రిలో చోటుచేసుకుంది. జడ్చర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన ఏరియా ఆసుపత్రిలో ముందు ప్రతిరోజు 700 పైగా ఓపి పేషెంట్లు ఆసుపత్రి వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని వెళ్లేవారు అని కాగా రానురాను ఆస్పత్రిలో పర్యవేక్షణ లోపంతో సిబ్బంది దూరుసు ప్రవర్తనతో మందుల కొరతతో పాటు మందులు బయటికి రాయడం వైద్య పరీక్షలపై బయటికి పోవడం వంటి సమస్యలు తలెత్తుతుండడంతో నిత్యం 700 వందల పైగా ఉండే ఓపి పేషెంట్ల సంఖ్య 300 వందలకు పడిపోయింది.
ఏదైనా జబ్బుతో ఆస్పత్రిలో ఇన్ పేషెంట్గా చేరిన వారి అటెండర్ లతో ఆసుపత్రి సిబ్బంది దోలుసుగా వ్యవహరిస్తారని ఏమన్నా చెప్పడానికి పోయిన గాని అంతా తమకు తెలుసు అని మీరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదని ముందు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి అందరిని బయటికి పంపించి మీరు మాత్రం పేషెంట్లకు సరైన చికిత్స అందించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఇన్ పేషంట్ల అటెండర్స్లు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు కిందిస్థాయి సిబ్బంది తరచుగా చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఎంతో కొంత డబ్బులు చేతుల పెడితే కానీ ఆస్పత్రిలోని వార్డులను శుభ్రం చేయడం లేదని పలువురు ఆరోపించారు. జడ్చర్ల పట్టణంలో 44వ జాతీయ రహదారితో పాటు 167 వ జాతీయ రహదారి ఉండడంతో తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాల బాధితులను పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్లు నామమాత్రంగా పరిశీలించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా రిఫర్ చేస్తూ ఉంటారు. రెండు జాతీయ రహదారులను కలిగి ఉన్న జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య సిబ్బందిని పెంచి సరైన వసతులు కల్పించడంతోపాటు ఆర్థో డాక్టర్ ని నియమించాలని ఆసుపత్రి పై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వం ఆసుపత్రికి అందించాల్సిన నిధులు మందులు అందించి మెరుగైన సేవలు అందించి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి పై భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు






