- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయి : ముచ్చర్ల జనార్థన్ రెడ్డి
క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఖేల్ సంసద్ పార్లమెంట్ ఇన్ చార్జి ముచ్చర్ల జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, జడ్చర్ల : క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఖేల్ సంసద్ పార్లమెంట్ ఇన్ చార్జి ముచ్చర్ల జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్-2026 క్రీడా పోటీలలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఖో ఖో ఫైనల్ మ్యాచ్‌లు క్రీడాభిమానులను అలరించాయి. ఈ పోటీలలో బాలానగర్, జడ్చర్ల టౌన్, నవపేట్, ఊరుకొండ, జడ్చర్ల రూరల్ మండలాలకు చెందిన జట్లు పాల్గొని ప్రతిభ కనబర్చాయి. పోటీలు ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రికెట్ విభాగంలో జడ్చర్ల టౌన్ జట్టు విజేతగా నిలవగా, వాలీబాల్ మరియు కబడ్డీ విభాగాల్లో బాలానగర్ జట్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ఖో ఖో పోటీల్లో ఊరుకొండ జట్టు గెలుపొందింది. విజేతలకు సంసద్ ఖేల్ మహోత్సవ్ పార్లమెంట్ ఇంచార్జ్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, బీజేపీ జిల్లా, పట్టణ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






