క్రీడ‌లు మాన‌సిక ఉల్లాసాన్ని క‌లిగిస్తాయి: ఎంఈఓ రాజు నాయ‌క్

by Ratna Kumari |

క్రీడ‌లు మాన‌సిక ఉల్లాసాన్ని క‌లిగిస్తాయని మండల విద్యాధికారి రాజు నాయక్ పేర్కొన్నారు.

క్రీడ‌లు మాన‌సిక ఉల్లాసాన్ని క‌లిగిస్తాయి: ఎంఈఓ రాజు నాయ‌క్
X

దిశ‌, మహమ్మదాబాద్ : క్రీడ‌లు మాన‌సిక ఉల్లాసాన్ని క‌లిగిస్తాయని మండల విద్యాధికారి రాజు నాయక్ పేర్కొన్నారు. మండ‌లంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల నంచ‌ర్ల స్కూల్ కాంప్లెక్స్ ప‌రిధిలోని ఉపాధ్యాయుల‌కు ప్ర‌ధానోపాధ్యాయులు సురేంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో క్రికెట్ పోటీలు నిర్వ‌హించారు. ముఖ్యఅతిథిగా ఎంఈఓ హాజ‌రై టాస్ వేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనతో పాటు క్రీడల్లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసం పెరిగి, పని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఉపాధ్యాయుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు బీజం భీంరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకాంత్, హన్మంతు, రాములు, ఖాదర్, శ్రీనివాస్, గడ్డం వెంకటేష్, విష్ణు, ఆశప్ప, వీరేశలింగం, మల్లేష్, బసప్ప, గోపాల్, శ్రీహరి, గంగయ్య, ఆనంద్, వెంకటేష్, అంజిలయ్య, శీనయ్య పాల్గొన్నారు.

Next Story