- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దిశ, దేవరకద్ర : నూతనంగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీ లోని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు.

దిశ, దేవరకద్ర : నూతనంగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీ లోని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో దేవరకద్ర మున్సిపాలిటీ అభివృద్ధికి సంబందించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ డ్రైనేజీ, నీరు విద్యుత్, రోడ్లు మున్సిపాలిటీలోని సమస్యలపై అధికారులతో చర్చించారు. ఇటీవల మున్సిపాలిటీ కి ప్రభుత్వం మంజూరు చేసిన 15కోట్ల నిధులకు సంబంధించి పనుల గురించి మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజేషన్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ దీపిక, ఎంపీడీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, ఏఈలు కీర్తి, శ్రీకాంత్, ఎస్సై నాగన్న ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






