- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశిష్ట రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి : ఏఓ డాకేశ్వర్ గౌడ్
మండలంలో రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు “విశిష్ట రైతు గుర్తింపు కార్డు” (యూనిక్ ఐడి) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

దిశ, వీపనగండ్ల : మండలంలో రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు “విశిష్ట రైతు గుర్తింపు కార్డు” (యూనిక్ ఐడి) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతులు తప్పనిసరిగా 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి డాకేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఈ గుర్తింపు కార్డు ద్వారా రైతుల పంట సాగు వివరాలు, భూసమాచారం, పంటల రికార్డులు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో నష్టాలను అంచనా వేయడం సులభమవుతుందని అన్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్, పంటల బీమా వంటి పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే ఈ విశిష్ట గుర్తింపు కార్డు నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.






