- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి కోసం అత్త, మామకు కరెంట్ షాక్ పెట్టిన అల్లుడు..!
ఆస్తి కోసం తన భార్య తల్లినే కరెంట్ షాక్ ఇచ్చి అల్లుడు చంపిన విషాద ఘటన గార్ల మండలంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం
దిశ, గార్ల : ఆస్తి కోసం తన భార్య తల్లినే కరెంట్ షాక్ ఇచ్చి అల్లుడు చంపిన విషాద ఘటన గార్ల మండలంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట పంచాయితీ మంగళ తండాలో బానోత్ రాజేష్ అనే వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సమీపంలోని బేతాలంపాడుకు చెందిన తన అత్త, మామలు దారావత్ రాందాస్-కౌసల్య లను తన సొంత గ్రామం మంగళతండాకు పిలిపించుకున్నాడు. రాజేష్ అన్న అయిన రమేష్ కు గతం లో వివాహం అయి విడాకులు తీసుకున్నాడు. రాజేష్ అత్త మామలు తన అన్న రమేష్ కు రెండో వివాహంగా కౌసల్య అన్న కూతురు అంజలిని ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు.
ఈ తరుణంలోనే తన అన్న ఆస్తి తనకు దక్కకుండా అతనికి రెండో పెళ్లి చేసారని అత్త-మామలపై కక్ష ను పెంచుకున్నాడు. దీంతో తన ఇంటికి వచ్చిన వారికీ మద్యం తాగించాడట. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు నిందితుడు రాజేష్, ముందుగా మామ రాందాస్ కు కరెంట్ షాక్ ఇవ్వగా సృహ కోల్పోయాడు. దీంతో అతడు చనిపోయినట్లు భావించి ఆ తరువాత అత్త కౌసల్య కు కరెంట్ షాక్ ఇచ్చాడు. దీంతో అక్కడికి అక్కడే అత్తమ్మ మృతి చెందారు. ఈ ఆలజడిని గమనించిన రాజేష్ వదిన అంజలి, భార్య జ్యోతిలు రాజేష్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై కత్తితో దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సృహ తప్పి పడిపోయిన మామ రాందాస్ ను ఆసుపత్రికి తరలించారు.
కాగా సమాచారం అందుకున్న డి.ఎస్.పి తిరుపతిరావు,గార్ల -బయ్యారం సిఐ రవీందర్,గార్ల ఎస్సై బి. సాయికుమార్ లు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ తరుణంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డోర్నకల్, బయ్యారం ఎస్సై లు పోలీస్ బలగల తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






