బతుకు చిత్రాన్ని మార్చిన షార్ట్ సర్క్యూట్..!

by Ratna Kumari |

రెక్కాడితే కానీ డొక్కాడని ఆ టైలర్ జీవితంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తీరని వేదన మిగిల్చింది.

బతుకు చిత్రాన్ని మార్చిన షార్ట్ సర్క్యూట్..!
X

దిశ, అలంపూర్ : రెక్కాడితే కానీ డొక్కాడని ఆ టైలర్ జీవితంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తీరని వేదన మిగిల్చింది. మానవపాడు టైలర్ గౌసియా రిజ్వాన్ మధ్యాహ్నం ఇంట్లో కుట్టుపనిలో నిమగ్నమై ఉండగా.. ఎవరో పిలిచినట్లు అనిపించి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఆమె తిరిగి వచ్చే లోపే కుట్టు మిషన్, పెళ్లికి సంబంధించిన‌ కొత్త బట్టలు, టైలర్ మెటీరియల్, కూలర్, టీవీ, సెల్ ఫోన్ అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాకుండా కస్టమర్లు నమ్మకంతో ఇచ్చిన విలువైన పెళ్లి బట్టలు, మగ్గం వర్క్ మెటీరియల్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితురాలు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story