చోరీ కేసుల్లో ఏడుగురు నిందితుల అరెస్టు

by Elthuri vijay kumar |

కొయిల్ కొండ మండల కేంద్రంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన ఏడుగురు దొంగలను గురువారం రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

చోరీ కేసుల్లో ఏడుగురు నిందితుల అరెస్టు
X

చోరీ కేసుల్లో ఏడుగురు నిందితుల అరెస్టు

- దొంగలను పట్టుకున్న రూరల్ పోలీసులు

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: కొయిల్ కొండ మండల కేంద్రంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన ఏడుగురు దొంగలను గురువారం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. కొయిల్ కొండ మండల కేంద్రంలో అబ్ధుల్ అజీజ్ అలియాస్ చావూస్ అనే వ్యక్తి షాపులో ఈ నెల 11న అర్ధరాత్రి షాపు షట్టర్లను పగులగొట్టి షాప్ లో ఉన్న రూ.4 లక్షల నగదు, బంగారం దోపిడీ జరిగినట్లు షాపు యజమాని కోయిల్ కొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును రూరల్ సీఐ గాంధీనాయక్, కోయిల్ కొండ ఎస్ఐ తిరుపాజీ కేసు దర్యాప్తులో ఉండగా, గురువారం కేశవాపూర్ క్రాస్ రోడ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా, రెండు కార్లలో ఏడుగురు వ్యక్తులు ఉండగా అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.3.10 లక్షల నగదు, బంగారం,1.8 కిలోల రోల్డ్ గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకొన్నట్లు ఆయన వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించనున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story