విద్యార్థుల‌ను బ‌య‌టికి పంపి.. త‌ర‌గ‌తి గ‌దికి తాళం..!

by Ratna Kumari |

చదువుకుంటున్న విద్యార్థుల‌ను బయటికి పంపించి తరగతి గదికి ఓ కాంట్రాక్టర్ తాళం వేసిన సంఘటన అయిజ మండలంలో చోటుచేసుకుంది.

విద్యార్థుల‌ను బ‌య‌టికి పంపి.. త‌ర‌గ‌తి గ‌దికి తాళం..!
X

దిశ, అలంపూర్ టౌన్/అయిజ: చదువుకుంటున్న విద్యార్థుల‌ను బయటికి పంపించి తరగతి గదికి ఓ కాంట్రాక్టర్ తాళం వేసిన సంఘటన అయిజ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండల పరిధిలోని చిన్న తాండ్రపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తగా భవనం నిర్మించారు. పాఠశాలలో గదులు చాలకపోవడంతో, కొత్తగా నిర్మించిన భవనంలో ఉపాధ్యాయులు తరగతులు ప్రారంభించారు. ఇది తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ పాఠశాలకు వచ్చి పిల్లలను బయటికి పంపించి తరగతి గదికి తాళం వేశారు. ఒక రోజుకు అవకాశం ఇవ్వండని ఉపాధ్యాయులు వేడుకోవడంతో కాంట్రాక్టర్ తాళం తీశాడు. భవనం నిర్మించి నాలుగు సంవత్సరాలు అవుతున్నా, తనకు సంబంధించిన డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, డబ్బులు మంజూరు అయ్యేంతవరకు భవనం తెరవద్దని ఉపాధ్యాయులకు చెప్పినట్టు సమాచారం. తరగతి గదికి తాళం వేసిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story