స్వయం పరిపాలన దినోత్సవం

by Jakkula.Mamatha |

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యం సాధిస్తారని పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి అన్నారు.

స్వయం పరిపాలన దినోత్సవం
X

దిశ, మిడ్జిల్: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యం సాధిస్తారని పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్లేట్ గ్రామర్ స్కూల్ శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. విద్యార్థులు ఒక రోజు కలెక్టర్‌, డీఈవో, ఎంఈవోలుగా పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠశాలను బోధించారు. విద్యార్థుల వేషధారణ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ఉపాధ్యాయురాలు రాధ, పాఠశాల బృందం తదితరులు ఉన్నారు.

Next Story