సైన్స్ ఫేర్ సృజనాత్మకత శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతాయి

by Ratna Kumari |

సైన్స్ ఫేర్ ప్రాజెక్టులు విద్యార్థులలో సృజనాత్మకత శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతాయని కాకతీయ పాఠశాల డైరెక్టర్ ఎస్‌.జగపతిరావు అన్నారు.

సైన్స్ ఫేర్ సృజనాత్మకత శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతాయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : సైన్స్ ఫేర్ ప్రాజెక్టులు విద్యార్థులలో సృజనాత్మకత శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతాయని కాకతీయ పాఠశాల డైరెక్టర్ ఎస్‌.జగపతిరావు అన్నారు. శనివారం స్థానిక టీచర్స్ కాలనీలోని కాకాతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో కాకతీయ హైస్కూల్ లో నిర్వహించిన 'సైన్స్ ఫేర్' ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రదర్శనలో ఆసక్తికరమైన కొత్త విషయాలను ఎంచుకోవడం, ప్రాజెక్టు వెనుక ఉన్న సైన్స్ ను అర్థం చేసుకోవడం, ఆకర్షణీయమైన వర్కింగ్ మోడల్ తయారు చేయడం, ప్రాజెక్టు వివరాలను, ఫలితాలను స్పష్టంగా ప్రదర్శించే అవకాశాలు ఉంటాయని అన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం సేకరించిన రాజుల కాలం నాటి పురాతన నాణ్యాలు, అన్ని దేశాల కరెన్సీ నోట్లు, సముద్రపు శంఖులు, గవ్వలు, నక్షత్రపు చేపలు, అలి చిప్పలు లాంటివి ప్రదర్శించి విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపోందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ షబ్బీర్ అహ్మద్, మెనేజ్మెంట్ సభ్యులు చంద్రశేఖర్ రావు, నాగేందర్, ప్రిన్సిపాల్ మల్లేష్ కుమార్, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తంచేశారు.

Next Story