- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ బంద్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం తీరు నశించాలి : TPTLF
దిశ, వనపర్తి టౌన్ : బీసీ బంద్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం తీరు నశించాలని టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ అయిత పేర్కొన్నారు.

దిశ, వనపర్తి టౌన్ : బీసీ బంద్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం తీరు నశించాలని టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ అయిత పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి పట్టణం రాజీవ్ చౌక్ లో బీసీ బంద్ కి సహకరించని రాక్ వుడ్ పాఠశాల యాజమాన్య తీరుకు నిరసనగా చేపట్టిన ధర్నాలో టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ అయిత మాట్లాడుతూ ఈ నెల 18న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకై నిర్వహించిన బంద్ కి సహకరించకపోగా పాఠశాల బంద్ చేసి తమకు సహకరించాలని వెళ్లిన ఎస్సీ, బీసీ నాయకులను కులం పేరుతో దూషించడంతో పాటు వారి పై కేసులు నమోదు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. యాజమాన్యం, ఉపాధ్యాయులను రూంలో బంధించి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేయడం, నాయకులను కులం పేరుతో దూషించడాన్ని ఖండిస్తూ, నాయకులపై పెట్టిన కేసులను తొలగించాలని ఇందుకు కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ అనిత, యాజమాన్యం పై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ వనపర్తి జిల్లా నాయకులు జి మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆది, ముదిరాజ్ సంగం నాయకులు శివ, వాల్మీకి సంగం నేత కురుమయ్య, కేవీపీఎస్ నాయకులు నాగరాజు, బీసీ సంఘాల నేతలు రవి, నాగరాజు, నగేష్ పాల్గొన్నారు.






