పెత్తందారి వ్యవస్థను ప్రశ్నించిన పండుగ సాయన్న

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నూటా ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణ సమాజంలో జమీందారీ భూస్వాముల పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నించిన పండుగ సాయన్న దారుణంగా చంపారని బీసీ జెఏసి

పెత్తందారి వ్యవస్థను ప్రశ్నించిన పండుగ సాయన్న
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నూటా ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణ సమాజంలో జమీందారీ భూస్వాముల పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నించిన పండుగ సాయన్న దారుణంగా చంపారని బీసీ జెఏసి చైర్మెన్ బెక్కెం జనార్ధన్ అన్నారు. ఆదివారం పండుగ సాయన్న వర్థంతి సందర్భంగా స్థానిక తెలంగాణ చౌరస్తాలోని టిఎన్జీఓల సంఘం భవనంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ ఆధిపత్యాన్ని నిరసించారని, పేద వర్గాలు జీవించే హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన రాబిన్ హుడ్ గా పేరొందిన పండుగ సాయన్న వర్థంతి సభ ను ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటలకు స్థానిక టిఎన్జీఓల సంఘం భవనంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బ్రహ్మయ్య, విద్యాసాగర్, ప్రభాకర్, నరహరి చారి, విప్పెయ్యి గౌడ్ లు పాల్గొన్నారు.

Next Story