గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ లు పాటు పడాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, జోగులాంబ ప్రతినిధి : గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ లు పాటు పడాలి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి

గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ లు పాటు పడాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ లు పాటు పడాలి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గంలో నూత‌నంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌ర్పంచ్ ల‌కు, ఉప స‌ర్పంచ్ లు, వార్డు స‌భ్యుల‌ను శుక్ర‌వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎస్డీఎఫ్ నిధుల ద్వారా రూ.2కోట్ల‌, 51 ల‌క్ష‌లు కేటాయించిన‌ట్టు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్రామ‌పంచాయ‌తీ అభివృద్ధి కోసం కృషిచేస్తుంద‌ని తెలిపారు. ప్ర‌తీ గ్రామ‌పంచాయ‌తీకి రూ.3 నుంచి 5 ల‌క్ష‌ల చొప్పున నిధులు కేటాయించిన‌ట్టు తెలిపారు. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి చెందడానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.

Next Story