- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాజాపూర్ ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా : సర్పంచ్ సంగీత
దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాజాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నూతన సర్పంచ్ కాంట్రే సంగీత అన్నారు. శుక్రవారం నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ గ్రామంలోని 9వ వార్డు పరిశీలించి ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో సీసీ రోడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వార్డుల్లో నెలకొన్నవిద్యుత్ సమస్యలు మొదటగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్యతో పాటు మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తొమ్మిదవ వార్డు సభ్యులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వార్డు ప్రజల కోరిక మేరకు దేవాలయానికి మైక్ సెట్ ను జాతర సమయంలో అందజేస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం 9వ వార్డు శ్రీధర్ రెడ్డి తో పాటు గ్రామ సర్పంచ్ సంగీత ఉపసర్పంచ్ లక్ష్మణులతో పాటు ఉమ్మడి నాయకులకు వార్డు సభ్యులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షులు ఆలుగడ్డ క్రాంతి కుమార్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి రంగాపూర్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ కిష్టప్ప బిజెపి గ్రామ అధ్యక్షులు గోవిందు గ్రామ నాయకులు రాములు మన్నె బాబు మొగులప్ప, కనకప్ప, శరత్, లక్ష్మీకాంత్, రాములు పాల్గొన్నారు.






