- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ లో చేరిన చిన్నంబావి సర్పంచ్
చిన్నంబావి మండల సర్పంచ్ దివ్య శ్రీ, మాజీ సర్పంచ్ రంజిత్ కుమార్, కాలూర్ ఉప సర్పంచ్ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

దిశ, చిన్నంబావి : చిన్నంబావి మండల సర్పంచ్ దివ్య శ్రీ, మాజీ సర్పంచ్ రంజిత్ కుమార్, కాలూర్ ఉప సర్పంచ్ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరుగుతుందని.. స్థానికంగా ఏ ఎన్నికలు వచ్చినా కొల్లాపూర్ కోట పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బీరం, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అభిలాష్ రావు, చిన్నంబావి మండల ముఖ్య నాయకులు శ్రీధర్ రెడ్డి, తిరుపాలు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.






