- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల అభివృద్ధితోనే గ్రామాభివృద్ధి : సర్పంచ్ జమాల్ పూర్ రామ్ లాల్
దిశ, మహమ్మదాబాద్ : మహిళల అభివృద్ధితోనే గ్రామాభివృద్ధి అని సర్పంచ్ జమాల్ పూర్ రామ్ లాల్ పేర్కొన్నారు. మహమ్మదాబాద్

దిశ, మహమ్మదాబాద్ : మహిళల అభివృద్ధితోనే గ్రామాభివృద్ధి అని సర్పంచ్ జమాల్ పూర్ రామ్ లాల్ పేర్కొన్నారు. మహమ్మదాబాద్ గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జమాల్ పూర్ రామ్ లాల్, ఉప సర్పంచ్ పవన్ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. గ్రామంలోని మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని అన్నారు. ఉపసర్పంచ్ పవన్ మాట్లాడుతూ మహిళలకు చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహిళల అభివృద్ధితోనే గ్రామంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






