కమిషనర్ ను కార్మికులు ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ లీడర్...

by Disha Web Desk 20 |
కమిషనర్ ను కార్మికులు ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ లీడర్...
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేయించడానికి వెళ్ళిన కమిషనర్ కార్మికులతో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మున్సిపల్ కమిషనర్ కార్మికులను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు వారిపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో జడ్చర్ల పట్టణంలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకెళితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 19వార్డులో చైర్ పర్సన్ దోరేపల్లి లక్మి రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో చైర్మన్ వెంట కమిషనర్ షమీ మహమూద్ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే పక్కనే ఉన్న 18వ వార్డు సందర్శనకు తన సహాయక సిబ్బంది, పారి శుధ్య కార్మికులను వెంట బెట్టుకొని వెళ్లిన కమిషనర్ మొహమ్మద్ షేక్ వెళ్లారు.

దీంతో మున్సిపల్ కార్మికులను మసీయోధింన్ అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా బూతులు తిడుతుండడంతో కార్మికులను ఎందుకు తిడుతున్నారని కార్మికులను తిట్టడం సరైన పద్ధతి కాదని చెబుతుండగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మసీయోద్దీన్ ,అతని కుమారుడు అమీర్ ఇద్దరు కలిసి తమ వార్డుకు ఎందుకు వచ్చారని కమిషనర్ మొహమ్మద్ షేక్ ను నిలదీశారు. ఇందులో భాగంగానే వాగ్వివాదానికి దిగారు. వార్డు సమస్యల గురించి తాము ఇన్నాళ్లు చెబితే ఎందుకు స్పందించలేదని కమిషనర్ పట్ల దురుసుగా అసభ్య పదజాలంతో భూతుపురణానికి దిగారు. ఒక దశలో దాడికి ప్రయత్నించగా, సహనం కోల్పోయిన కమిషనర్ మొహ్మద్ షేక్ సైతం మసీయోద్దీన్ పట్ల అదే స్థాయిలో సమాధానం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ లీడర్ మసీయోద్దీన్ మున్సిపల్ కార్మికుల పట్ల, కమిషనర్ మొహమ్మద్ షేక్ పట్ల అనుసరించిన విధానం పట్ల కార్మికులు పట్టణంలోని అంబేద్కర్ కూడా రాస్తారోకో, ఆందోళనతో నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని నేతాజీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న జడ్చర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మహమ్మద్ షేక్ ఇచ్చిన ఫిర్యాదు పై బీఆర్ఎస్ లీడర్ మసీయోద్దీన్, అతని కుమారుడు అమీర్ పై చట్టప్రకారం కేసులు నమోదు చేశారని ఎస్సై లెనిన్ తెలిపారు.


Next Story