సంపత్ కుమార్ పాదయాత్రలో రూ. 100 కోట్ల ముచ్చట

by Dishanational1 |
సంపత్ కుమార్ పాదయాత్రలో రూ. 100 కోట్ల ముచ్చట
X

దిశ, అయిజ: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప మన బతుకులు బాగుపడవు అని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూమార్ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ సంపత్ కుమార్ నిర్వహిస్తున్న స్వతంత్ర గౌరవ పాదయాత్ర 5వ రోజు అయిజ మండలంలోని గుడిదొడ్డి, జడ్ దొడ్డి గ్రామాల మీదుగా అయిజ పట్టణంలోని ఎస్సీ కాలనీలో బాబు జగ్జీవన్ రావ్ చౌక్ నుండి గాంధీ చౌక్ పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ కొత్త బస్టాండ్, ఆర్ఆర్బీ గెస్ట్ హౌస్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. ప్రతి వార్డు నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంపత్ కుమార్ కు బ్రహ్మరథం పట్టి పూలమాలలతో, శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సంపత్ కూమార్ మాట్లాడుతూ ఇన్ని రోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయామని, బంగారు తెలంగాణ పేరు చెప్పి కుటుంబ పాలనతో కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని సంపత్ కుమార్ విమర్శించారు. ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కాచెల్లెళ్లకు ఏం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అక్కా చెల్లెమ్మకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు, అలాగే దళితులకు మూడు ఎకరాలు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అన్నారు.

మాస్టర్ షేక్షావలి ఆచారి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు దళారుల అవతారమెత్తి కమీషన్లకు కక్కుర్తి పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఎద్దేవా చేశారు. చేతనైతే నిరంజన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపాలిటీకి రూ. 100 కోట్ల నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి, తనయుడు జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed