గ్రామీణ క్రీడాకారులు ఒలంపిక్ క్రీడల్లో రాణించాలి :

by Ratna Kumari |

గ్రామీణ క్రీడాకారులు ఒలంపిక్ క్రీడల్లో రాణించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఆకాంక్షించారు.

గ్రామీణ క్రీడాకారులు ఒలంపిక్ క్రీడల్లో రాణించాలి :
X

దిశ, వనపర్తి : గ్రామీణ క్రీడాకారులు ఒలంపిక్ క్రీడల్లో రాణించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడామైదానం లోక్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ ర్యాలీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి అండర్ 17 హాకీ టోర్నమెంట్ కు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి,స్థానిక శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి ల‌తో కలిసి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడా స్ఫూర్తితో శ్రమను ఆదిగమించడమే విజయ రహస్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి రూ.850 కోట్లుకేటాయించామనితెలిపారు.ఈ సంవత్సరం దాదాపు 12700 గ్రామాలలో సీఎం కప్ క్రీడలను గ్రామీణ స్థాయి నుండి మొదలు పెట్టి, సీఎం కప్ క్రీడా సర్టిఫికెట్ లను భవిష్యత్తులో విద్యా, ఉద్యోగాల భర్తీ లో ప్రధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు.


వచ్చే 2026 రాష్ట్ర బడ్జెట్ లో క్రీడారంగానికిసుమారు రూ.700కోట్లుకేటాయించనున్నామన్నారు. రెండు శాతం ఉన్న క్రీడా కోట 4 % పెంచనున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న,ఆడిన వనపర్తి పాఠశాల,కళాశాల క్రీడామైదానం ఇతరం విద్యార్థులు,క్రీడాకారులు ఆడడం ఎంతో గర్వకారణం.రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగంచేసుకొవాలన్నారు. విద్యార్థులు,యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం పట్టుదల,క్రమశిక్షణ తో విద్యానుఅభ్యసిస్తూ,క్రీడాలలోనూ రాణించాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకాలరులను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రానించేలా అవకాశాలు కల్పించడం సీఎం కప్ ముఖ్య ఉద్దేశం అన్నారు. క్రీడలు ఆడడం ద్వారా విద్యార్థులు,యువత శారీరకంగా,మానసికంగా జీవించేందుకుదోహదపడతాయన్నారు. ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితంలో పోటీతత్వం, పట్టుదల క్రీడామైదానం నుంచి మొదలవుతుందన్నారు. క్రీడలు విద్యార్థులు, యువత కు మనస్తైర్యంపెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పాఠశాల విద్యా శాఖ,ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు అబ్దుల్ ఘని, అంజయ్య, డీఎస్పీ వెంకటేశ్వర రావు, క్రీడలు యువజన శాఖ జిల్లా అధికారి సుధీర్ రెడ్డి, ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ బోలమోని కుమార్, త‌హ‌శీల్దార్ రమేష్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చందాపురం బాలస్వామి పాల్గొన్నారు.

Next Story