పరుగులు పెడుతున్న దుందుభి నది

by Taduka Kalyani |   (  Updated:2024-02-03 13:28:05  IST  )

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దుందుభి నది పరుగులు పెడుతోంది

పరుగులు పెడుతున్న దుందుభి  నది
X

దిశ, జడ్చర్ల: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దుందుభి నది పరుగులు పెడుతోంది. జడ్చర్ల మండలం కోడ్గల్, లింగంపేట గ్రామాల పరిధిలో దుందుభి వాగు పొంగిపొర్లుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో తొలకరి ఆలస్యంగా ఆరంభం కావడంతో ఆకాశం వైపు వర్షాల కొరకు ఎదురుచూసిన అన్నదాతలకు ఇటీవల కురిసిన వర్షాలు వారి ఆశలను చిగురింపజేశాయి. గత నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న నిరంతర వర్షాలకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో గంగమ్మ తమ చెంతకు చేరిందని గ్రామస్తులు గంగమ్మకు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

దీంతో ఒక్కసారి తమ ప్రాంతంలో వాగు మత్తడి పారితే మూడు నాలుగు పంటల వరకు పుష్కలంగా సాగు చేసుకోవచ్చని అంతేగాక భూగర్భ జలాలు నిండి దుందుభి పరిసర ప్రాంతాలలో అనేక గ్రామాల రైతులు వేలాది ఎకరాలలో పంటలు పండించుకునేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏడాదికాలం తర్వాత మొదటిసారిగా తమ ప్రాంతంలో గంగమ్మ పొంగిపొర్లుతుండడంతో పరవళ్లను తిలకించడానికి గంగమ్మ చెంతకు గ్రామస్తులు పరుగులు తీస్తున్నారు.

Next Story