- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవల్లి మండల విద్యుత్ అధికారి సస్పెండ్
రేవల్లి మండల పరిధిలోని ఓ విద్యుత్ అధికారి తీరు వివాదస్పదంగా మారింది. గత కొద్ది రోజుల కిందట మద్యం మత్తులో ఓ మహిళతో మండల ప్రజల ముందే అసభ్యంగా చిందులు వేయడంతో అతని ప్రవర్తన పై తీవ్ర వివాదస్పదం అయింది.

దిశ, రేవల్లి : రేవల్లి మండల పరిధిలోని ఓ విద్యుత్ అధికారి తీరు వివాదస్పదంగా మారింది. గత కొద్ది రోజుల కిందట మద్యం మత్తులో ఓ మహిళతో మండల ప్రజల ముందే అసభ్యంగా చిందులు వేయడంతో అతని ప్రవర్తన పై తీవ్ర వివాదస్పదం అయింది. ఉన్నతాధికారులు అతన్ని ఆదివారం సస్పెండ్ చేశారు. అతను . చిందులేసిన వీడియోలు, ఫోటోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, ప్రభుత్వ పెద్దలు మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. విద్యుత్ లైన్ల మరమ్మతులు, కనెక్షన్ సమస్యల పరిష్కారం వంటి సేవలను సక్రమంగా అందించకుండా, మద్యం బాటిళ్లకు ప్రలోబాలకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహిస్తున్నాడని కూడా ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు శాఖపరమైన చర్యలు తీసుకున్నట్లు డీఈ శ్రీనివాస్ ధ్రువీకరించగా మండల విద్యుత్ పరిపాలన బాధ్యతలు ఇచ్చే విషయం ఇంకా నిర్ణయం జరగలేదని తెలిపారు.






