మానవీయ సంబంధాలు కలిగిన వ్యక్తి గా గుర్తుంటారు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

by Ratna Kumari |

దిశ, వనపర్తి : వృత్తిలో నిబద్దత,క్రమశిక్షణ మానవీయ సంబంధాలు కలిగిన వ్యక్తి గా వనపర్తి జిల్లా ఎస్.పి రావుల గిరిధర్ వనపర్తి జిల్లా ప్రజలకు గుర్తుంటారని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

మానవీయ సంబంధాలు కలిగిన వ్యక్తి గా గుర్తుంటారు :   కలెక్టర్ ఆదర్శ్ సురభి
X

దిశ, వనపర్తి : వృత్తిలో నిబద్దత,క్రమశిక్షణ మానవీయ సంబంధాలు కలిగిన వ్యక్తి గా వనపర్తి జిల్లా ఎస్.పి రావుల గిరిధర్ వనపర్తి జిల్లా ప్రజలకు గుర్తుంటారని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఎస్పీ రావుల గిరిధర్ బదిలీ అయిన సందర్బంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిధిగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. కలెక్టర్ వనపర్తి జిల్లా కు ఎస్పీ గిరిధర్ అందించిన సేవల కు గుర్తుగా మెమెంటోఅందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ గిరిధర్ పోలీసు అధికారిగా అంకిత భావం తో పనిచేసారని కొనియాడారు. కవి గా,సామాజికవేత్తగా ప్రజలకు చేరువైన వ్యక్తి దూరమవడం బాధాకరం.శాంతి భద్రత లో,సామాజిక అంశాల పై దృష్టి సారించి,పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్,ఏ.ఆర్ క్వాటర్స్ ను ఏర్పాటు చేశారు.ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా లో 36 బాల్య వివాహల పై కేసులు నమోదు చేశారు.డ్రగ్స్ మాదక ద్రావ్యల నియంత్రణ లో ముఖ్య పాత్ర పోషించారన్నారు.పోలీసు శాఖ అధికారిగానే కాక మంచి మానవ సంబంధాలకు విలువనిచ్చే మనిషిగా వనపర్తి ప్రజల గుండెలలో గుర్తుంటారన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల కు బదిలీలు సాధారణమైన,ప్రజల లో చోటు సంపాదించుకోవడం కొందరికే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ సతీమణి (రాష్ట్ర రాష్ట్ర బాలల సంరక్షణ కమిషన్ సభ్యురాలు)ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి,డిఎస్పి వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, లోకనాథ్ రెడ్డి,వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,వనపర్తి ,కొత్తకోట,ఆత్మకూర్,కొత్తకోట సిఐలు కృష్ణయ్య, రాంబాబు,శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్,పోలీసు అధికారులు సిబ్బంది,ప్రజాప్రతినిధులు, పాత్రికేయమిత్రులు పాల్గొన్నారు.

Next Story