మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల

by Ratna Kumari |

దిశ, కందనూల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన 24 వార్డుల ముసాయిదా ఓటర్ జాబితాను గురువారం నాగర్ కర్నూల్ మున్సిపల్ అధికారులు విడుదల చేశారు.

మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల
X

దిశ, కందనూల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన 24 వార్డుల ముసాయిదా ఓటర్ జాబితాను గురువారం నాగర్ కర్నూల్ మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ ముసాయిదా ఓటర్ జాబితా మున్సిపల్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి వివరించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలు, వయస్సు తదితర అంశాల్లో ఏవైనా తప్పులు, సవరణలు అవసరమైతే సంబంధిత అభ్యంతరాలు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించవచ్చన్నారు. అందిన అభ్యంతరాలను పరిశీలించి, నిబంధనల మేరకు సరిదిద్దనున్నట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటయ్య, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ వినోద్‌ పాల్గొన్నారు.

Next Story