- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి : ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్
దిశ, వనపర్తి : ప్రభుత్వ నియమ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యాలయంలో

దిశ, వనపర్తి : ప్రభుత్వ నియమ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల అన్యాయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ధిక్కరిస్తూ, నిబంధనలకు విరుద్దంగా ఆదివారం సెలవు దినాలలో కూడ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విశ్రాంతి దినాలలో కూడ తరగతులు నిర్వహించడంతో మానసిక ఒత్తిడికి, భయాందోళనలకు గురవుతున్నారన్నారు. విద్యా హక్కులకు ఉల్లంఘిస్తూ విద్యార్థులను భయపెట్టి విద్యార్థులతో ఇష్టంతో వస్తునం అనేవిధంగా లెటర్ రాయించడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులను మానసికంగా హింసించడం,బలవంతపు విధానాలతో చదివించడం చట్టవ్యతిరేకం అన్నారు.ప్రైవేట్ పాఠశాల అక్రమాలకు పై విద్యా శాఖ అధికారులు స్పందించక పోవడందురదృష్టకరమన్నారు.చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై విద్యా శాఖ అధికారులు తక్షణమే స్పందింస్తూ విచారణ చేపట్టి (శ్రీ చైతన్య స్కూల్) అనుమతులను రద్దు చేయాలని, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలను చెపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్,నందు,మహబూబ్,సంతోష్,వంశీ,బలరాం,సంతోష్ పాల్గొన్నారు.






