అచ్చంపేట‌లో అరుదైన లాప్రోస్కోపిక్ శ‌స్త్ర‌చికిత్స

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ బాల్ సింగ్ (ఎంఎస్), అసిస్టెంట్ ప్రొఫెసర్, (జిజిహెచ్ నాగర్ కర్నూల్) అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో విజయవంతంగా నిర్వహించారు.

అచ్చంపేట‌లో అరుదైన లాప్రోస్కోపిక్ శ‌స్త్ర‌చికిత్స
X

దిశ, అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ బాల్ సింగ్ (ఎంఎస్), అసిస్టెంట్ ప్రొఫెసర్, (జిజిహెచ్ నాగర్ కర్నూల్) అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో విజయవంతంగా నిర్వహించారు.దాదాపు 45 సంవత్సరాల మహిళ తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి రాగా డాక్టర్ బాల్ సింగ్ (ఎంఎస్), అసిస్టెంట్ ప్రొఫెసర్, (జిజిహెచ్ నాగర్ కర్నూల్) ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి, స్కానింగ్ చేయగా గర్భసంచిలో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ( మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ ) ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇలాంటి కేసులకు సాధారణంగా మెట్రో నగరాల్లో మాత్రమే లభ్యమయ్యే లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ అనే ఆధునాతన శస్త్రచికిత్సను అచ్చంపేటలోనే విజయవంతంగా నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌ను డాక్టర్ బాల్ సింగ్ ఆధ్వర్యంలో అనస్థీషియా నిపుణుడు డాక్టర్ రవీందర్, వైద్య బృందం సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని డాక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అత్యవసర చికిత్సలకు 24 గంటల సదుపాయం కల్పిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. వైద్య సేవలు అవసరమైన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Next Story