పామును కాటేసిన స్నేక్ క్యాచ‌ర్..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-09 12:01:41  IST  )

దిశ‌, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల శివారులో రైల్వే స్టేషన్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో 10 అడుగుల పాము చొరబడిందని కార్యాలయం సిబ్బంది పాములు

పామును కాటేసిన స్నేక్ క్యాచ‌ర్..!
X

దిశ‌, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల శివారులో రైల్వే స్టేషన్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో 10 అడుగుల పాము చొరబడిందని కార్యాలయం సిబ్బంది పాములు పట్టే వ్యక్తి పాముల రాముడు కి సమాచారం అందించారు. అతను 10 నిమిషాల్లోనే పామును చాకచక్యంగా పట్టేశాడు. కానీ ఇక్కడే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టుబడిన పామును కొట్టిన చని పోకపోవడంతో రెండు మూడు సార్లు అటు, ఇటు పామును కొరికేసి పక్కకు పడేశాడు. తనకేమీ కాదని... అందులో విషం ఉండదని చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. రాముడు మాత్రం ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు.

Next Story