రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అమ్మాలి

by Ratna Kumari |

రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అమ్మాలని ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి కోర్ర రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఫర్టిలైజర్, విత్తన దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అమ్మాలి
X

దిశ, ఉప్పునుంతల : రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అమ్మాలని ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి కోర్ర రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఫర్టిలైజర్, విత్తన దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ స్టాక్ బోర్డు, రిజిస్టర్, బిల్ బుక్కులు తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రతి షాప్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి షాప్ యజమానులు రిజిస్టర్ కచ్చితంగా నిర్వహించాలని అన్నారు. రైతులు కూడా కొనుగోలు చేసిన ప్రతి దానికి బిల్లు తీసుకోవాలని ఆయన తెలిపారు. రైతులను మోసం చేస్తే షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story