- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవోపై నిరసన
దిశ, గద్వాల : ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో నెం.252ను నిరసిస్తూ తెలంగాణ

దిశ, గద్వాల : ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో నెం.252ను నిరసిస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H 143) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 డిసెంబర్ 2025 శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ‘ఛలో కలెక్టరేట్’ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. నూతన జీవోలోని నిబంధనల వల్ల అర్హులైన అనేక మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్‌కు దూరమవుతున్నారని, ఇది జర్నలిస్టుల హక్కులను హరించే చర్యగా వారు విమర్శించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.జిల్లాలోని జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి జర్నలిస్టుల ఐక్యతను చాటాలని TUWJ H-143 జిల్లా శాఖ పిలుపునిచ్చింది.






