పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అంద‌జేత

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల కేంద్రంలోని గ్రామ‌పంచాయ‌తీల్లో ప‌ని చేసే పారిశుధ్య కార్మికుల‌కు ఇవాళ ప్ర‌భుత్వ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అంద‌జేత
X

దిశ‌, న‌ర్వ : మండ‌ల కేంద్రంలోని గ్రామ‌పంచాయ‌తీల్లో ప‌ని చేసే పారిశుధ్య కార్మికుల‌కు ఇవాళ ప్ర‌భుత్వ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. పీపీఈ కిట్ల‌ను పంపిణీ చేసారు. ఈ సంద‌ర్భంగా న‌ర్వ స‌ర్పంచ్ హ‌న్మంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత కోసం ప్రతినిత్యం పోరాడుతూ వాళ్ల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కార్మికులు మన కొరకు పరిసరాలను శుభ్రపరుస్తున్నారని అన్నారు. వారి ఆరోగ్య కోసం భద్రతను కాపాడడం గ్రామపంచాయతీ బాధ్యత అని తెలిపారు. అవసరమైన రక్షణ సామాగ్రి, వైద్య సేవలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. అనంతరం కార్మికులకు, వైద్య సిబ్బందికి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీఓ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, వైద్య బృందం, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

Next Story