పార్టీ కోసం ప‌ని చేసే వారికి ప‌ద‌వులు త‌ప్ప‌నిస‌రి

by Ratna Kumari |

పార్టీ కోసం ప‌ని చేసే వారికి ప‌ద‌వులు త‌ప్ప‌కుండా ద‌క్కుతాయ‌ని వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షులు శివ‌సేన రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు చిన్నారెడ్డి తెలిపారు.

పార్టీ కోసం ప‌ని చేసే వారికి ప‌ద‌వులు త‌ప్ప‌నిస‌రి
X

దిశ‌, రేవ‌ల్లి : పార్టీ కోసం ప‌ని చేసే వారికి ప‌ద‌వులు త‌ప్ప‌కుండా ద‌క్కుతాయ‌ని వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షులు శివ‌సేన రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు చిన్నారెడ్డి తెలిపారు. బుధ‌వారం రేవ‌ల్లి, ఏదుల మండ‌ల కాంగ్రెస్ క‌మిటీల ఏర్పాటుకు వారు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గానికి రెండు నూత‌న వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డుల‌ను మంజూరు చేసింద‌ని.. అలాగే 7 సింగిల్ విండో సంఘాల‌ను సైతం మంజూరు చేసింద‌ని మేఘారెడ్డి తెలిపారు.

రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నూతన మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లో గ్రామ అధ్యక్షుడి పదవికి అధిక ప్రాముఖ్యత ఉంటుందని గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ అధ్యక్షులను ఫలితం నూతనంగా నియమిస్తున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి పదవులు తప్పకుండా దక్కుతాయని పార్టీ సముచిత స్థానం కల్పించనున్నట్లు వారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు ఉచిత కరెంటు రేషన్ బియ్యం, రేషన్ కార్డులు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం మహిళల సంఘాల భాగస్వామ్యంతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు, వడ్డీ లేని రుణాలు లాంటి అనేక పథకాలు చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మనం వెనకబడి పోతున్నామని అందుకు తావివ్వకుండా ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని వారు సూచించారు.


ఏదుల గ్రామంలో రిజర్వాయర్ నిర్మించారు తప్ప రిజర్వాయర్ నుంచి వనపర్తి నియోజకవర్గంలోని సాగుభూములకు చుక్క నీరు రాకపోవడం దురదృష్టకరమని వారన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో , ఎంపీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, కౌన్సిలర్ల , ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని రానున్న రోజుల్లో సైతం ప్రతిపక్షాలు చేసే ప్రతి పని ని తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని వారు సూచించారు. నూతనంగా ఏర్పాటైన ఏదుల మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. మండ‌ల అధ్య‌క్షుడి నియామ‌కం కోసం ఆశావాహుల నుంచి పేర్ల‌ను సేక‌రించారు. త్వ‌ర‌లోనే మండ‌ల క‌మిటీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిపారు. కార్య‌క్ర‌మంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ జర్నల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, OBC జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, సీనియర్ నాయకులు పందెం సుఖేందర్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వాడల పర్వతాలు, చీర్ల జనార్ధన్, తిరుపతయ్య, రాజేందర్ రెడ్డి,యాదగిరి, సర్పంచ్ పరశురాం యాదవ్, గోపాల్ పేట‌ మండల ఎన్ఎస్ యూఐ నాయకులు జానకి రాములు, ఆయా గ్రామాల్లో సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story