ఎస్ఐఆర్ కు రాజ‌కీయ ప‌క్షాలు స‌హ‌క‌రించాలి

by Ratna Kumari |

త్వరలో నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పక్షాలు సహకరించాలనీ కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్ సూచించారు.

ఎస్ఐఆర్ కు రాజ‌కీయ ప‌క్షాలు స‌హ‌క‌రించాలి
X

దిశ, కొల్లాపూర్ : త్వరలో నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పక్షాలు సహకరించాలనీ కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్ సూచించారు. శనివారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఎస్ఐఆర్ పై జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్పించుటకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. ఒకవేళ జాబితాలో నుంచి అనర్హుల పేర్లను తొలగించాల్సి ఉంటదని, అందుకు ఇంటింటికి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్లకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలన్నారు. సమావేశంలో తహశీల్దార్ మాధవి, బీఆర్ఎస్ నుంచి నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాటం జంబులయ్య, అంకిరావు పల్లి జగదీశ్వర్ రెడ్డి, భాస్కర్ రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, బీఎస్పీ నాయకులు కురుమయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి మండల అధ్యక్షుడు బాలరాజు, మాజీ సర్పంచ్ వెంకట స్వామి పాల్గొన్నారు.

Next Story