ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంతో పోలీసులు పనిచేయాలి : ఎస్పీ జానకి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మన ప్రధాన లక్ష్యం ప్రజల భద్రత, న్యాయం, నమ్మకం కల్పించడం కోసం, ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో పారదర్శకత, క్రమశిక్షణ, సమయపాలన తో

ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంతో పోలీసులు పనిచేయాలి : ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మన ప్రధాన లక్ష్యం ప్రజల భద్రత, న్యాయం, నమ్మకం కల్పించడం కోసం, ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో పారదర్శకత, క్రమశిక్షణ, సమయపాలన తో పనిచేయాలని ఎస్పీ జానకి సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ జానకి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. డీజీపీ శివధర్ రెడ్డి సూచించిన పలు సూచనలను సంక్షిప్తంగా వివరిస్తూ, వాటి అమలు కోసం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ లకు ప్రాధాన్యతతో అమలు చేసి, ప్రతి వారం నివేదిక ఇవ్వాలని, సీసీటిఎన్ఎస్ అప్టేట్ సమయానికి నమోదు చేసి, పెండింగ్ ఎఫ్ఐఆర్ లు, ఛార్జీషీట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కారణాలను లోతుగా విశ్లేషించి, డ్రంకన్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించాలని, ప్రతి సర్కిల్ లో రోడ్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. రౌడీ షీట్స్, సస్పెక్ట్స్ పునర్విపరిశీలించి, తిరిగి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. పెండింగ్ కేసులు, మిస్సింగ్ వ్యక్తులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయం జరిగేలా కృషి చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ పెద్దలు, మహిళా, యువజన సంఘాలతో సమన్వయం కొనసాగిస్తూ ప్రతి పోలీసింగ్ బలపరచాలని ఆమె ఆదేశించారు. ఈవీసీ లో డిసిఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఏవో రుక్మిణీ భాయి, సీసీఎస్ సీఐ, ఐటి సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story