- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పోలీసుల మాక్ డ్రిల్
ప్రజల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం, మక్తల్ పోలీసులు, ప్రత్యేక సాయుధ బలగాలు కలిసి గురువారం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు.

దిశ, మక్తల్ : ప్రజల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం, మక్తల్ పోలీసులు, ప్రత్యేక సాయుధ బలగాలు కలిసి గురువారం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హాక్ మాట్లాడుతూ .. ఎంత పెద్ద స్టార్ హీరోకైనా మంచి టేక్ కోసం రిహార్సల్స్ అవసరమేనని, అలాగే పోలీసులకు కూడా నిరంతర శిక్షణ తప్పనిసరి అని తెలిపారు. జిల్లా ఎస్పీ డా.వినీత్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల నేపథ్యంలో మాబ్ కంట్రోల్ సామర్ధ్యాలను పెంపొందించేందుకు ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రిల్‌లో ఫుట్ ఫార్మేషన్, టీమ్ కో ఆర్డినేషన్, హెచ్చరిక విధానాలు, చట్టపరమైన చర్యల అమలు వంటి అంశాలను పోలీసులు ప్రాక్టీకల్‌గా ప్రదర్శించారు. స్మోక్ గన్, ఫైర్ ఇంజిన్ ద్వారా మాబ్‌ను ఎలా కంట్రోల్ చేయాలో అవగాహన కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్‌లాల్, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మి రెడ్డి, రేవతి, ఆర్‌ఎస్‌ఐలు శివశంకర్, మద్దయ్య, ఫైర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






