- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు-బైకు ఢీ.. వ్యక్తి మృతి
దిశ, చిన్నచింతకుంట : కురుమూర్తి జాతరకు వస్తుండగా కారు ద్విచక్ర వాహనం ఢీ ఒకరు మృతి మరొకరికి గాయాలు ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, చిన్నచింతకుంట : కురుమూర్తి జాతరకు వస్తుండగా కారు ద్విచక్ర వాహనం ఢీ ఒకరు మృతి మరొకరికి గాయాలు ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ వైపు నుంచి కురుమూర్తి జాతరకు టీఎస్ 07 హెచ్ సి 9859 బైకుపై వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ కు చెందిన బోయ నితీష్, నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరుకు చెందిన జోగు నందు ఇరువురు స్నేహితులు కలిసి వస్తుండగా ముందున్న ఆటోను తప్పించబోయి కురుమూర్తి జాతర నుంచి వస్తున్న టీఎస్ 03 ఈ యు 8148 నంబరు గల కారు ను అతివేగంగా బైకు ఢీ కొట్టడంతో బైక్ పై వెనకాల కూర్చున్న జోగు నందు(23) ఎగిరి వెనకాల వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ డోర్ కు తల తగలడంతో రక్త గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న నితీష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవఖానాకు తరలించి ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కై 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగిందన్నారు. మృతి చెందిన యువకుడుని వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.






