డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలి

by velandi.Saikiran |

డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన పెండింగ్ పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన పెండింగ్ పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూం గృహాల ప్రారంభోత్సవం సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉండటంతో, పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పెండింగ్ లో ఉన్న పెయింటింగ్ పనులను పూర్తిచేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవం సమయానికి సమస్యలేమీ లేకుండా సౌకర్యవంతమైన గృహాలను అందించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ,ఆర్డీఓ అలివేలు, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గద్వాల్ తహసీల్దార్ మల్లికార్జున్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శ్రీనివాస్ రెడ్డి,ఈ.ఈ. (పిఆర్) దామోదర్, విద్యుత్ శాఖ డి.ఈ. తిరుపతిరావు,మున్సిపల్ కమిషనర్ జానకి రామ్,మిషన్ భగీరథ ఇంట్రా డి.ఈ పరమేశ్వరి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story