రేవ‌ల్లిలో ప్ర‌శాంతంగా బీసీ బంద్..!

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేర‌కు రేవ‌ల్లి మండ‌ల కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి వ‌ర్గీయ నాయ‌కులు పాల్గొన‌గా.. బీఆర్ఎస్ నాయ‌కులు

రేవ‌ల్లిలో ప్ర‌శాంతంగా బీసీ బంద్..!
X

దిశ‌, రేవ‌ల్లి : రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేర‌కు రేవ‌ల్లి మండ‌ల కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి వ‌ర్గీయ నాయ‌కులు పాల్గొన‌గా.. బీఆర్ఎస్ నాయ‌కులు ఎవ్వ‌రూ ఇందులో పాల్గొన‌లేదు. బీసీల‌కు స్థానిక ఎన్నిక‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ.. ప‌లు వ్యాపార స‌ముదాయాలు, విద్యా సంస్థ‌ల‌ను మూసివేయించారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ త‌హ‌శీల్దార్ ల‌క్ష్మిదేవికి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వాడ‌ల ప‌ర్వ‌తాలు, దాసు బాల‌స్వామి, సురేష్ గౌడ్, నాగిరెడ్డి, బంగారు శ్రీను, కేశ‌వ్ యాద‌వ్ పాల్గొన్నారు.

Next Story