మ‌క్త‌ల్ లో పార్టీ విధేయుల‌కే ప‌ట్టం .. ముందే చెప్పిన 'దిశ'

by Ratna Kumari |   (  Updated:2026-02-16 12:23:13  IST  )

మ‌క్త‌ల్ చైర్మ‌న్ గా వాకిటి మాన‌స‌, వైస్ చైర్మ‌న్ గా శైవిరెడ్డి ఎంపిక‌య్యారు. వీరితో సోమ‌వారం ఎన్నిక‌ల అధికారి రాజేంద‌ర్ గౌడ్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

మ‌క్త‌ల్ లో పార్టీ విధేయుల‌కే ప‌ట్టం .. ముందే చెప్పిన దిశ
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ చైర్మ‌న్ గా వాకిటి మాన‌స‌, వైస్ చైర్మ‌న్ గా శైవిరెడ్డి ఎంపిక‌య్యారు. వీరితో సోమ‌వారం ఎన్నిక‌ల అధికారి రాజేంద‌ర్ గౌడ్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్, వార్డు స‌భ్యుల‌ను మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శాలువాల‌తో సత్క‌రించారు. గ‌త కొద్ది రోజులుగా మ‌క్త‌ల్ చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు మ‌ల్ల‌గుల్లాలు ప‌డిన ఎట్ట‌కేల‌కు ఎంపిక చేసిన వారిని దిశ న‌ర్మ‌గ‌ర్భంగా ముందే చెప్పింది. మ‌క్త‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వీ పార్టీ విధేయుల‌కు ద‌క్కుతుంద‌ని మంత్రి మ‌దిలోని మాట‌ను దిశ ముంద‌స్తుగా చెప్పిన మాట‌నే వాస్త‌వం అయింది. మ‌క్త‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని 14వ వార్డు నుంచి గెలుపొందిన వాకిటి మాన‌స ను చైర్మ‌న్ గా ప్ర‌క‌టించింది. గ‌తంలో మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీలో ఉన్న ఆ కుటుంబానికి రెండోసారి కూడా అదే కుటుంబానికి వైస్ చైర్మ‌న్ ప‌దవీ ద‌క్కింది. వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీని 9వ వార్డు స‌భ్యురాలు శైవిరెడ్డి ద‌క్కించుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహ‌రి ఎప్పుడూ పార్టీకి క‌ట్టుబ‌డిన వారికే ప్రాధాన్య‌త‌ను ఇస్తార‌ని ఎప్పుడు చెబుతుండేవారు. మ‌క్త‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ గా ఎంపికైన ఇద్ద‌రూ వారి తండ్రుల‌కు ఇల్ల‌రికంగా వ‌చ్చిన వారి సంతానం కావ‌డం విశేషం. ఇద్ద‌రూ నాయ‌కుల‌తోనే ప్ర‌జ‌ల‌తో సంబంధాలు మంచిగా ఉండ‌టంతో ఎంపిక‌పై ఎలాంటి వివాదం చోటు చేసుకోలేదు.

Next Story