- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు విద్యార్థులు చరిత్రను తిరగరాయాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు విద్యార్థులు విద్యా రంగ చరిత్రను తిరగరాయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలమూరు విద్యార్థులు విద్యా రంగ చరిత్రను తిరగరాయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బోయపల్లి రోడ్డులో గల తువ్వగుట్టపై ఉన్న వైటిసీ భవనంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 148 మంది విద్యార్థులకు 'వందేమాతరం ఫౌండేషన్ అండ్ మహబూబ్ నగర్ ఫస్ట్' సంయుక్తంగా ఏర్పాటు చేసిన 45 రోజుల ఐఐఐటీ ప్రవేశ శిక్షణా ముగింపు కార్యక్రమానికి ఆయన ఎస్పీ జానకి, మేయర్ మమత, డిఫ్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి లతో కలిసి పాల్గొని ప్రసంగించారు. పాలమూరు అంటేనే లేబర్ జిల్లా అని, ఇది వలసలకు పెట్టింది పేరని పూర్తిగా చిన్నచూపు చూసిన గత పాలకులకు బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నామని అన్నారు. మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టిన ప్రతిబిడ్డ అసాధారణమైన ప్రతిభ గలవారని, కోహినూర్ వజ్రం లాంటి ఈ విద్యార్థులను సాన పట్టకుండా అలక్ష్యం చేశారని ఆయన విచారం వ్యక్తంచేశారు. పాలమూరుకు కావాల్సింది ఎడ్జ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అని, తాను ఎడ్జ్యుకేషన్ ను చూసుకుంటానని, ఇరిగేషన్ ను పెద్దలు చూసుకుంటారని ఆయన అన్నారు.
పాలమూరు శ్రామిక జిల్లా కాదని, తెలంగాణ ఉద్యమ అనంతరం మోసపోయిన జిల్లా అని, ఇక్కడి గత పాలకులు రంగులు పూసి అభివృద్ధి ఇదే అని మభ్యపెట్టారని, అభివృద్ధి అంటే విద్యార్థులకు విద్యనందించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడమని ఆయన అన్నారు. ఇక్కడి విద్యార్థులకు మేథస్సు, తెలివి, జ్ఞానం ఉందని, వాటిని పూర్తిగా వినియోగించుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఇక్కడ ఉన్న లక్షలాది మంది విద్యార్థుల లక్ష్యం ఐఐఐటీ అని దాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ, తాను ప్రభుత్వ పాఠశాలలో చదివానని, అప్పుడు ఇంతటి స్టడీమెటీరియల్, సహాకారం, ఎంకరేజ్మెంట్ లేవని, అయినా కష్టపడి చదివి ఐపిఎస్ కాగలిగానని, మీలో కూడా చదువాలనే కసి,తపన కనిపించాలని ఆమె సూచించారు. అబ్దుల్ కలాం అన్నట్లుగా కలలు కనండి వాటిని సాకారం చేసుకొండని చెప్పారని,ఆయన బాటలో నడిచి ఆయనంతటి గొప్పవాళ్ళు కావాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఈవో ప్రవీణ్ కుమార్, 'మహబూబ్ నగర్ ఫస్ట్' నిర్వాహకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్, ఐఐఐటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రవణ్ కుమార్, రవిప్రకాష్, జగపతిరావు, రామకృష్ణ, కార్పోరేటర్ రాధా గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.






