- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పాలమూరు' పాపం తలా పిడికెడు
by Ratna Kumari |
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడం పాలకవర్గాల నిర్లక్ష్యమని, అది ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా తిలా పాపం తలా పిడికెడు అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అసోసియేట్ చైర్మన్ బెక్కెం జనార్దన్ తీవ్రంగా విమర్శించారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోవడం పాలకవర్గాల నిర్లక్ష్యమని, అది ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా తిలా పాపం తలా పిడికెడు అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అసోసియేట్ చైర్మన్ బెక్కెం జనార్దన్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కరువు జిల్లాను రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారే తప్ప, పాలమూరు రైతాంగానికి మేలు చెద్దామనే చిత్తశుద్ధి ఏ నాయకుడికి లేదని ఆయన ఆరోపించారు. గత 15 రోజులుగా పాలమూరు ఎత్తిపోతల పథకం సాధన కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులను కలిసి విన్నతీ పత్రాలను సమర్పించామని, మా విన్నపంతో ప్రభుత్వంలో చలనం వచ్చి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలనే నిర్ణయానికి రావడం శుభపరిణామం అని ఆయన అన్నారు. పాలమూరు అద్యయన వేధిక కన్వీనర్ ఎం.రాఘవాచారి మాట్లాడుతూ ఆల్మట్టి రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా గ్రావిటీ తో తెలంగాణకు నీరు సాధించగల అవకాశాలు ఉన్నాయని దానిని సాధించాలని ఆయన అన్నారు.
కృష్ణా నదిపై ఎగువన బ్యారేజి నిర్మాణం చేపట్టాలని, తుంగభద్ర ఎడమ కాలువను తెలంగాణ లోకి పొడిగించాలని, కృష్ణా-తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డ నీటి ప్రయోజనాలు నెరవేర్చాలని, దీనిని నెట్టెంపాడు తో అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంత సాగునీటి కోసం నాగార్జునసాగర్ గొట్టిముక్కుల ఎత్తపోతల పథకం ద్వారా నీటిని చేపట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖను ఒప్పించాలని ఆయన అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు, ఉదండాపూర్ నుండి లక్ష్మిదేవిపల్లి వరకు కాలువ, టన్నెల్, లిఫ్ట్ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నార్లాపూర్ నుండి లక్ష్మిదేవిపల్లి దాకా అన్ని పంపులు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ప్రత్యేక ప్రాధాన్యతతో వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కల్వకూర్తి లిఫ్ట్ లో 40 టిఎంసీ నీటికి గాను, 4 టిఎంసీ నీటి నిల్వకు మాత్రమే అవకాశం ఉన్నందున కల్వకూర్తి, 'పాలమూరు' లిఫ్టులను సమన్వయంతో చేపట్టి చివరి ఆయకట్టు దాకా సాగునీరివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భీమా దగ్గర ఒక బ్యారేజి నిర్మించడం 'పాలమూరు' కు ప్రమాదకరమని, ఆ నిర్ణయాన్ని మానుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిమ్మప్ప, హానీఫ్ అహ్మద్, చెన్నకిష్టన్న, పరమేశ్వర్, సాయిబాబా, ఖలీల్, కేసీ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు.
Next Story






