- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ అధికారుల నిర్వాకంతో పాడి గేదే మృతి
మండల పరిధిలోని ఉల్పర గ్రామానికి చెందిన రైతు వెల్దాల లాలయ్య రూ.1లక్ష విలువ చేసే పాడి గేదె విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం మృతి చెందింది.

దిశ, వంగూర్ : మండల పరిధిలోని ఉల్పర గ్రామానికి చెందిన రైతు వెల్దాల లాలయ్య రూ.1లక్ష విలువ చేసే పాడి గేదె విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం కురిసిన గాలివానకు ఆరు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలకు మరమ్మత్తులు చేయకుండానే విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని ఆరోపించారు. ఈ క్రమంలో నీరు త్రాగడానికి వెళ్లిన పాడి గేదె విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఈ ఘటనతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. లక్ష రూపాయల విలువ చేసే గేదె మృతి చెందడంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తూ, బాధిత రైతుకు తక్షణమే నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని స్థానికులు, బాధితులు అధికారులను కోరుతున్నారు.






