- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహమ్మదాబాద్ లో ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

దిశ, మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరాన్ని గ్రామ సర్పంచ్ జే.రామ్ లాల్ ప్రారంభించగా డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ శిబిరంలో చిన్నపిల్లల వైద్యం, గైనకాలజీ, డెంటల్, కంటి, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాల నిపుణులు సేవలు అందించారు. మొత్తం 540 మంది రోగులు పరీక్షలు చేయించుకోగా, 121 మందిని మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమం గ్రామపంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర రెడ్డి వార్డు సభ్యులు, ఎండీ రహీం మల్లేష్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.






