మ‌రికొద్ది సేప‌ట్లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్..!

by Ratna Kumari |

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌రికొద్ది సేప‌ట్లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డే విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఏ పార్టీకి చెందిన‌ అభ్య‌ర్థుల లిస్ట్ మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

మ‌రికొద్ది సేప‌ట్లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌రికొద్ది సేప‌ట్లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డే విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఏ పార్టీకి చెందిన‌ అభ్య‌ర్థుల లిస్ట్ మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి మ‌క్త‌ల్ మున్సిప‌ల్ గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటుండ‌టంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అధికార కాంగ్రెస్ లో అభ్య‌ర్థులు ఎవ‌రు అనేది అధిష్టానం ఎటు తేల్చుకోలేక‌పోతోంది. పోటీలో ప్ర‌ధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేసే అభ్య‌ర్థుల లిస్ట్ ముఖ్య నాయ‌కులు, ఎన్నిక‌ల ఇన్ చార్జి ఎటు తేల్చుకోలేక‌పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే.. మ‌క్త‌ల్ మున్సిపాలిటీలో మొద‌టి చైర్మ‌న్ పీఠం బీజేపీ కైవ‌సం చేసుకుంది. మ‌ళ్లీ త‌మ ప్ర‌తాపం చూపించాల‌ని అధిష్టానం ఆలోచిస్తున్న‌ప్ప‌టికీ.. అధికార పార్టీని ఈ సారి బీజేపీ ఢీ కొంటుందా..? లేదా అనే సందిగ్దంలో ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ మంత్రిగా మున్సిపాలిటీనీ కైవ‌సం చేసుకోవాల‌ని అధికార కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని, పోటీ ప‌డుతున్న అభ్య‌ర్థుల్లో స‌మ‌ర్థులైన నాయ‌కుల‌ను పోటీలోనిల‌బెట్టాల‌ని ఎలాగైనా మ‌క్త‌ల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి పావులు క‌దుపుతున్నారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ లో స‌మ‌ర్థ‌వంతంగా ఢీ కొనే నాయ‌కులు క‌నుచూపుమేర‌లో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఫామ్ హౌస్ లో కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎన్నిక‌ల ఖ‌ర్చు పెట్టేందుకు ఆర్థికంగా ఉంటేనే పోటీలో ఉండండి అని.. అధిస్టానం నుంచి ఎలాంటి ఆర్థిక స‌హాయం అంద‌ద‌ని క‌రాకండిగా చెప్పారు. పోటీలో దిగుతున్న వాళ్లు రెండు పార్టీల అభ్య‌ర్థుల‌ను త‌ట్టుకునేందుకు సిద్ధంగా లేర‌ని బీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

అధికార కాంగ్రెస్ పార్టీనీ త‌ట్టుకొని గెలుపు బాట‌లు వేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ నాయ‌కులు లోపాయ‌కారి ఒప్పందంతో ఉన్న‌ట్టు స‌మాచారం. బీజేపీ, బీఆర్ఎస్ లో ఆర్థికంగా ఉన్న నాయ‌కులను పోటీలో నిలిపి పోరాడాల‌ని, మెజార్టీ వ‌స్తే.. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్, కో ఆప్ష‌న్ స‌భ్యుల పంపకాలు చేసుకోవాల‌ని రెండు పార్టీలు ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు మ‌క్త‌ల్ మున్సిపాలిటీలో ఎలాగైనా స‌రే కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. తానే పోటీ అభ్య‌ర్థిగాఉంటామ‌ని.. త‌మ‌కే టికెట్ ద‌క్కుతుంద‌ని అనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు త‌మ వార్డుల్లో అప్పుడే ప్ర‌చారాన్ని ప్రారంభించారు. మ‌రోవైపు త‌మ ఉనికినీ చాటుకోవ‌డానికి జ‌న‌సేన స‌మితి ఇటీవ‌ల ఎన్నిక‌ల ఇన్ చార్జీ ఆధ్వ‌ర్యంలో స‌మావేశం నిర్వ‌హించి పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను స్వీక‌రించారు. ఏది ఏమైనా మ‌క్త‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చైర్మ‌న్ పీఠాన్ని ఎవ‌రు ద‌క్కించుకుంటారనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story